నిజామాబాద్ సిటీ బతుకమ్మ : 2025 సంవత్సరానికి గానూ జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ (జేసిఐ) ఇందూర్ నూతన అధ్యక్షురాలిగా గౌతమి పెందోటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన జేసిఐ ఎన్నికల సమావేశంలో
క్లబ్ ప్రతినిధులు గౌతమిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా కార్యదర్శిగా జైపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు గౌతమి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తామని చెప్పారు.ముఖ్యంగా యువతకు విద్యార్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని పేదల కోసం సేవా కార్యక్రమాలు చేస్తామని ఆమె వివరించారు. త్వరలోనే పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సమావేశంలో జేసిఐ ఇందూర్ పూర్వాధ్యక్షులు బంగారి వీరబ్రహ్మం, వెంకటరమణ గౌడ్, విజయానంద్, లావణ్య, చంద్రశేఖర్, యాదేశ్ గౌడ్, సభ్యులు స్వరూప్ కుమార్, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

