29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

శ్రీరాంసాగర్ గా నామకరణం చేసి నేటికీ 46 ఏళ్ళు పూర్తి

Must read

📰 Generate e-Paper Clip

  •  నామకరణం చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం మర్రి చెన్నారెడ్డి
  • పోచంపాడును శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా నామకరణం

బతుకమ్మ, మోర్తాడ్: ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నామకరణం చేసి నేటికీ 46 ఏళ్లు పూర్తి అయి 47 సంవత్సరంలో అడుగిడుతుంది. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నుంచి ఈ ప్రాంతాన్ని పోచంపాడుగా పిలిచేవారు. 1963 జూలై 26న అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణ చివరి దశలో 1978 వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. 18 లక్షల ఎకరాల సాగునీటిని, త్రాగు నీటిని అందించే ఈ ప్రాజెక్టు గొప్పతనం తెలిసి ఈ ప్రాజెక్టు ను అప్పుడే పోచంపాడుగా పిలవడం బాగాలేదన్నారు. పోచంపాడులో పాడు అని ఉంది. ఈ గ్రామంలో గోదావరి నది తీరాన రాముడు నడయాడినట్లు చారిత్రక గాథల్లో ఉండడం, పవిత్ర గోదావరి నది తీరాన శ్రీ కోదండ రామలింగేశ్వర ఆలయం నిర్మించినందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఆనాటి నుండి ఆ పోచంపాడు ప్రాజెక్టును శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా పిలవబడుతుంది. రైతుల పంట పొలాలకు రెండు కాలాలు నిండుగా సాగునీటిని అందిస్తుంది. దీంతో బాల్కొండ మండలంలో ప్రవహించే కాలువలకు హై లెవెల్ కాలువలుగా పిలుస్తుండేవారు. ఈ జిల్లాలో రైతుల పంటల పంటలు రైతుల ఇంట సిరుల పంటను కురిపిస్తుండడంతో హై లెవెల్ కాలువకు లక్ష్మీ కాలువగా నామకరణం చేశారు. నిజామాబాద్ జిల్లా నుండి కరీంనగర్,వరంగల్ జిల్లాల మీదుగా ప్రవహించే కాల్వను దక్షిణ కాలువగా పిలిచేవారు. కాకతీయులు పరిపాలించిన ఓరుగల్లు (వరంగల్ )జిల్లా మీదుగా ప్రవహించడంతో ఈ కాలువను కాకతీయ కాలువగా పిలిచారు. అదిలాబాద్ జిల్లాలో పంటలకు సాగునీరు అందించే కాలువను ఉత్తర కాలువగా పిలిచేవారు. ఈ జిల్లాలో ప్రసిద్ధ బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రం ఉండడంతో సరస్వతి కాలువగా నామకరణం చేశారు. అదేవిధంగా శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి చేరుతుండడంతో మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేసి వృధాగా పోవడంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ముప్కాల్ జీరో పాయింట్ వద్ద 1963 జూన్ 6వ తేదీన ఇందిరమ్మ వరద కాలువకు శంకుస్థాపన చేశారు. కాలువ పనులు పూర్తయిన నాటినుండి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదలను వరద కాలువ ద్వారా పంట పొలాలకు అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు విడుదల చేయడం జరుగుతుంది.

More articles

Latest article