25.4 C
Hyderabad

ఆర్మూర్ ఏడిఎం విభాగం అస్తవ్యస్తం…?

Is the Armoor ADM department in disarray...?

Must read

📰 Generate e-Paper Clip

. . . ఈఆర్ఓ నుంచి ఏడిఎంలోకి ఎస్ఏ, వాచ్ మెన్

. . . ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే వలస ..!

. . . కంప్యూటర్ సీట్లో నైట్ వాచ్ మెన్

. . . రాత్రి కాపలా హుళక్కే..!

. . . గతంలో ఈఆర్ఓ అగ్గిపాలు

నిజామాబాద్, బతుకమ్మ:

విద్యుత్ శాఖలో వింత పోకడలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. పాలన గాడి తప్పిందేమో అన్నట్లుగా తయారయ్యింది ఆర్మూర్ డివిజన్ పరిస్థితి. ఉన్నతాధికారి పర్యవేక్షణ కొరవడడంతోనే సిబ్బంది ఇష్టారాజ్యంగ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టించుకునేవారు కరువవడంతో ఏడిఎం విభాగం అస్తవ్యస్తంగా మారిందనే చర్చ డివిజన్ పరిధిలో జరుగుతోంది. ముఖ గుర్తింపు హాజరు ఉన్నప్పటికీ ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పాలన విభాగంలో జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కక్కరే ఉన్నారు. పని భారం ఎక్కువవుతుందని పక్కనే ఉన్న ఈఆర్ఓ నుంచి సీనియర్ అసిస్టెంట్ ను తెప్పించుకున్నారు. దీనికి తోడుగా ఇదే విభాగంలో నైట్ వాచ్ మెన్ ను సైతం ఏడిఎంకు తెప్పించి కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేయించుకుంటున్నారని డివిజన్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇందులో విధులు నిర్వహించే జెఏఓ పదవి విరమణ పొందడంతో, పాస్ ఆర్డర్ జెఏఓ కు ఇంచార్జ్ బాద్యతలు అప్పగించారు. ఏడిఎంలో కీలక పోస్టులో ఉన్న అధికారి డివిజన్ స్థాయి ఉద్యోగులందరికి అందుబాటులో ఉండాలని, క్రీడల పేరిట తరచూ డుమ్మాలు కొట్టే అధికారికి ఇంచార్జ్ బాద్యతలు ఇవ్వడం అవసరమా అనే ప్రశ్నలు డివిజన్ స్థాయిలో ఉత్పన్నమవుతున్నాయి.
. . . ఉత్తర్వులు లేకుండానే..!
ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఈఆర్ఓ నుంచి పాలనా విభాగంలో సీనియర్ అసిస్టెంట్, నైట్ వాచ్ మెన్ (రాత్రి కాపలదారుడు) విధులు నిర్వహించడం నిబంధనలకు విరుద్దమని, అధికారుల సహకారంతోనే ఇదంతా నడుస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వీరు లేకపోవడం వల్ల ఈఆర్ఓ లో పని కుంటుపడుతోందని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఏడిఎంలో దినమంతా పని చేశాననే వంకతో నైట్ వాచ్ మెన్ రాత్రి కాపలా పనికి రావట్లేదని సమాచారం. వాచ్ మెన్ విధులు సరిగా లేకపోవడం వల్లే గతంలో ఈఆర్ఓ కార్యాలయంలో ఉన్న దస్త్రాలు అగ్గిపాలు అయ్యాయనే విషయం విదితమే. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే పెర్కిట్ సబ్ డివిజన్ ను, ఈఆర్ఓ కార్యాలయంను కలుపుకొని ముగ్గురు నైట్ వాచ్ మెన్ లను నియమించారు. ఇందులోని వారు విధులకు రాని సమయంలో సంఘటన జరిగినట్లయితే బాద్యులెవరనే సందేహాలు సిబ్బందిలో మెదులుతున్నాయి. డివిజన్ కార్యాలయంలో విధుల నిర్వహణలో సిబ్బంది ఇష్టారాజ్యంపై అధికారుల మౌనం వెనుక మర్మమేమిటో తెలియరావట్లేదనే చర్చ ఉద్యోగుల నుంచి వినబడుతోంది. పై స్థాయి అదికారుల అండదండలు ఉండడం వల్ల విధులకు రాకపోయిన పూర్తి వేతనం కట్టిస్తున్నారనే ఆరోపణలు డివిజన్ కాంపౌండ్ లో వినిపిస్తున్నాయి. విధులకు వచ్చిననాడే రాని రోజులకు గాను హాజరు వేసుకున్నగాని, అడ్డు చెప్పే నాథుడే లేకపోవడంతో అతను ఆడిందే ఆటగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. పాలన విభాగంలో జరుగుతున్న వ్యవహారాలపై విచారణ జరిపి, చక్కదిద్దాలనే అభిప్రాయాలను డివిజన్ ఉద్యోగులు వెలిబుచ్చుతున్నారు.

More articles

Latest article