25.5 C
Hyderabad

జైలు లో సేవలు కావాలా లంచం ఇవ్వాల్సిందే

If you want services in jail, you have to pay a bribe

Must read

📰 Generate e-Paper Clip

 

. . . లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జైలర్

. . . జైలు పెట్రోల్ బంక్ ఆపరేటర్ ద్వారా

వెబ్ డెస్క్, బతుకమ్మ :

జైలు లో ఉన్న రిమాండ్ ఖైదీ కి సేవలు కావాలా, అపరిమిత మూలకత్ (విజిట్ ) లు కావాలా అయితే జైలు అధికారులకు లంచం ఇవ్వాల్సిందే. ఇప్పుడు జైళ్ల శాఖలో ఇదే ట్రెండ్. అదే సంప్రదాయం పాటిస్తూ జైలర్ ఒకరు రిమాండ్ ఖైదీ మామ నుంచి జైలు శాఖ నిర్వహిస్తున్న బంక్ ఆపరేటర్ ద్వారా రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ జైలు జైలర్ నాంపల్లి దేవేందర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీష్ లు ఒక వ్యక్తి నుంచి రూ. 10 వెల లంచం తీసుకుంటూడగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఖమ్మం జైలు నుంచి హుజురాబాద్ కు ఒక రిమాండ్ ఖైదీ బదిలీ పై వచ్చారు. అయితే రిమాండ్ ఖైది కి జైలు లో సేవలు, మూలాఖత్ కోసం జైలర్ నాంపల్లి దేవేందర్ లంచం డిమాండ్ చేసారు. రిమాండ్ ఖైదీ మామ ఏసీబీ ని ఆశ్రయించారు. సోమవారం జైలర్, ఆపరేటర్ ద్వారా లంచం తీసుకుంటుండగా పట్టుకొని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్ట్ లో హాజరుపరిచారు.

More articles

Latest article