22 C
Hyderabad

గణేష్ మండలి నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలి

Ganesh pandal organizers must strictly adhere to the regulations.

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  పోలీస్ కమిషనర్ సాయిచైతన్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

గణేష్ మండలి నిర్వాహకులు పోలీసు శాఖ సూచించిన నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసు కమిషనర్ సాయిచైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.గణేష్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుండి డబ్బులను బలవంతంగా వసూలు చేయరాదని,గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని, స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం ఇవ్వాలన్నారు. గణేష్ మండళ్ల వద్ద సందర్శించే మహిళలపై, యువతులపై ఈవ్ టీజింగ్” జరుగకుండా చూడాలని, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా డి.జె / డి.జె మిక్సర్స్ / హైఫిడిలిటి ( హైఫై ) సౌండ్స్సిస్టమ్ ఇక్విప్మెంటు విషయంలో చాలా జాగ్రతలు వహించాలని సీపీ సూచించారు. రాత్రి 10 గంటలకు ” లౌడ్ స్పీకర్లు” ఆఫ్ చేయాలని,ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలని,లేని యెడల చట్టరీత్యా చర్యలు తీసుకొనబడునన్నారు.డి.జే లు పూర్తిగా నిషేదం తీసుకోవాలని, మైక్ పర్మీషన్ కోసం సంబంధిత ఎ.సి.పి ని సంప్రదించి తప్పని సరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు.విధ్యుత్ సరఫరా ఆగకుండా వీధి దీపాలు వెలిగేటట్లు చూడవలెనని, షార్టు సర్కూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరు ను ఉపయోగించాలి. ప్రతీ చోట ఎమ్.సి.బి ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలుగజేసే ఎటువంటి చిన్న సమాచారాన్ని అయిన మీ దగ్గరలోని పోలీసులకు, లేదా డయల్ 100 కు ఫోన్ చేయగలరు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 87126- 59700 కు తెలపాలన్నారు. గణేష్ మండలి వద్ద ఉదయం, రాత్రి వేళలో ఇద్దరూ లేదా ముగ్గురికి తక్కువ కాకుండా తమ కమిటీ మెంబర్ల ను మండలి వద్ద ఉంచవలెనని, పోలీస్ వారు చెకింగ్ కు వచ్చినప్పుడు ప్రతీసారి ఉండాలని, మండపం దగ్గర అసాంఘిక చర్యలు లేకుండా చూసుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తుల గూర్చి సమాచారం తెలియజేయాలని, మీ దగ్గరలో ఎవ్వరయిన అనుమానస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచూలు వదిలినట్లయితే వాటిని తాకరాదని అట్టి సమాచారం దగ్గరలోని పోలీస్ అధికారులకు తెలుపాలన్నారు. గణేష్ మండళ్ల వద్ద ఏప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు,రెండు బకెట్ల ఇసుక ఏర్పాటు చేసుకోవాలని, మరియు ఫైర్ బాల్స్ సమకూర్చుకోవాలన్నారు. యువకులు కోపతాపాలకు వెళ్లకుండా ” సంయమనం” పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి ” రూమర్స్ (పుకార్ల) ను నమ్మరాదన్నారు.ప్రజలకు అసౌకర్యం కలుగ కుండా నిరంతర పోలీస్ నిఘా ఏర్పాటు చేయబడిందని, సంబంధిత నిర్వాహకులు అవసరం నిమిత్తం ఉపయోగించుట కొరకు మీ దగ్గరలోని పోలీస్ సిబ్బంది ఫోన్ నెంబర్లను రాసి పెట్టుకోవాలన్నారు.గణేష్ భక్తులు, నిర్వాహకులు మద్యపానానికి దూరంగా ఉండాలని, గణేష్ మండళ్ల వద్ద” పేకాట ఆడరాదని, గణేష్ ఉత్సవాలలో” టపాసుల” నిషేదం ఉందన్నారు. నిమజ్జనం రోజు పోలీసు వారు జారీ చేసిన నియమ నిబంధనలు పాటిస్తూ విగ్రహాన్ని (రథాన్ని) “క్యూ” లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతీ రధనికి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు.వినాయక విగ్రహం తీసుకొని వచ్చే రోడ్డులో కానీ వినాయక విగ్రహం తీసుకొని  వెళ్లే రూటులో కానీ ఎంత ఎత్తు గలదో అట్టి దారి పొడవున ముందుగానే చూసుకోవాలని,ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని, ప్రజలు పోలీసులకు ఎల్లప్పుడు సహకరించాలని సీపీ తెలిపారు.

 

More articles

Latest article