పీఆర్ టీయు ఎలక్షన్ ఏకగ్రీవం అసాధ్యమా ?

0 6,425
  • పీఆర్ టీయు జిల్లా అధ్యక్ష బరిలో కొత్త వారు
  • జిల్లా ప్రధాన కార్యదర్శి ఫదవి కోసం హోరాహోరిగా తలపడుతున్న ముగ్గురు
  • గెలిచేందుకు లక్షల ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు
  • ఇంచార్జీ ఎంఇఓ అధికారిక గ్రూప్ లో ప్రచారం పై దుమారం

బతుకమ్మ, నిజామాబాద్: గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలలో ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్ టీయు లో ఎన్నికల కోలాహలం మొదలైంది. నిజామాబాద్ జిల్లాలో ఐదు వేల పైచిలుకుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, హెడ్మస్టర్ లు, ఎస్ జిటిలు, పిఇటిలు, సిఆర్ పిలు సభ్యులు కలిగిన పిఆర్ టియు 2024-27 సంవత్సరానికి నూతన జిల్లా కార్యవర్గం ఎన్నికలకు సంసిద్ధమైంది. నిజామాబాద్ పిఆర్ టియు జిల్లా కార్యవర్గానికి ఎన్నికలు తప్పేలా కనిపించడం లేదు. శనివారం వరకు ప్రధాన కార్యదరర్శ పదవి కోసం ముగ్గురు, ఇతర కార్యవర్గ పధవులకై ప్రచారం జరిగింది. కానీ జిల్లా అధ్యక్ష పదవిలో బరిలో ఉంటానని కొత్త వ్యక్తి తెరపైకి రావడంతో ఏకగ్రీవం సాద్యం కాదని ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని పిఆర్ టియులో చర్చ జరగుతుంది. ఈ నెల 14న జరగాల్సిన ఎన్నికలు శనివారం ప్రభుత్వం సెలవును ఎత్తివేయడంతో అదివారానికి వాయుదా పడింది. ఈ నెల 15న జిల్లా కార్యవర్గ సమావేశం జరిగాక అదే రోజు నామినేషన్ ల స్వీకరణ, ఎన్నికల నిర్వహణ జరగనుంది. ఇప్పటికే రాష్ర్ట కమిటి జిల్లా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. మొన్నటి వరకు అధ్యక్షుడిగా పని చేసిన పొద్దుటూరి మోహన్ రెడ్డి మరోసారి అధ్యక్షుడిగా బరిలో నిలిచారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న వెంకటేశ్వర్ గౌడ్ కూడా మరోసారి తన లక్ ను పరీక్షించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 35 మండలాల కార్యవర్గ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. దాదాపు 195 మంది ఓటర్లు కొత్త కార్యవర్గం ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొన్నటి వరకు ఎన్నికలు జరుగుతాయా? ఏకగ్రీవంగా జరుగుతుందా? అనేప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే జిల్లా అధ్యక్ష పదవికి మోహన్ రెడ్డి ఒక్కరే క్యాండెట్ గా ప్రచారం జరిగింది. శనివారం అనూహ్యంగా మరొకరు బరిలో ఉంటారని ప్రకటించడం కలకలం రేపింది. ఇప్పటి వరకు అధ్యక్ష పదవికి పోటీ ఉండదని అనుకున్న తరుణంలో ఆదివారం వరకు సమీకరణలు ఎటు మారుతాయో తేలకుండా ఉంది. జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్ రెండవసారి పోటీ చేస్తుండగా బోధన్ కు చెందిన అంబెల్లి శంకర్, నందిపేట్ కు చెందిన కిషన్ లు పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్ష పోస్టులు 5, కార్యదర్శిపోస్టులు 5, సహాయ కార్యదర్శి పోస్టులు మూడుతో పాటు మహిళ అనుబంధ సభ్యుల ఎన్నికలు జరుగడం ఖాయంగా ఉంది. ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉపాధ్యాయులు గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఇప్పటికే జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి లక్షల ఖర్చు అయినట్లు సమాచారం. ఈసారి కార్యదర్శి గెలిచిన వారు నిజామాబాద్ కార్యవర్గంపై పట్టుపెరుగుతుందన్న సంకల్పంతో ఖర్చుకు వెనుకాడడం లేదని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే క్యాంప్ లు, ప్రచారం జోరందుకోగా దావత్ లకు కొదవ లేకుండా ఉంది. కనీసం 3 లక్షల నుంచి 5 లక్షలకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులలో కీలకమైన ఉపాధ్యాయ సంఘం ఎన్నికలు టీచర్లలో ఉత్కంఠత రేపుతుంది. ఎన్నికల గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డుతున్న ఉపాధ్యాయ లీడర్లు కీలక పదవుల కొరకు పడరాని పాట్లు పడుతున్నారు. సామాజిక పరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న వారు గెలుపు లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇటీవల గోవూర్ హెడ్ మాష్టర్ , బోధన్ డివిజన్ లోని రెంజల్, నవీపేట్ మండలాలు మినహా మిగిలిన అన్నీ మండలాలకు ఎంఈవోగా పని చేస్తున్న నాగనాథ్ అధికారిక గ్రూప్ లో పలానా అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. అయితే పీఆర్ టీయూలో సీఆర్పీ మొదలుకుని గెజిటెడ్ హెడ్మాష్టార్ వరకు సభ్యులుగా ఉండడంతో వారందరూ పోటీ చేసేందుకు అర్హులైనప్పటికీ అధికారిక క్యాడర్ లోని నాయకుల మాదిరిగా ప్రచారం చేయడం మాత్రం తప్పుపడుతున్నారు. ఎంఈవో ఏ విధంగా ఎన్నికల ప్రచారం చేస్తారని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగానే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఆదివారం జరిగే జిల్లా కార్యవర్గ సమావేశం ఎన్నికల్లో కొత్త కార్యవర్గం ఎన్నికలా లేక ఏకగ్రీవమా అనేది తేలిపోనుంది. ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండగా అధ్యక్ష స్థానం ఏకగ్రీవం పై అంచనాలు ఉన్నాయి. ప్రధాన కార్యదర్శి పదవికి ముక్కోణపు పోటీ నేపథ్యంలో గెలుపు ఫలితాలు టఫ్ గా ఉంటాయని అంచనా వేయలేకపోతున్నారు. మిగిలిన కార్యవర్గానికి కూడా ఎన్నికలు జరుగనున్నా పెద్దగా ప్రభావం ఉండదని చెప్పాలి.

Leave A Reply

Your email address will not be published.