నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో నందిపేట మండల నుంచి సీనియర్ నాయకుడు నీరెళ్ల లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ కు తరలివెళ్లారు. సుమారు 50 కార్లలో 200 మంది నిజామాబాద్ నుంచి బయల్దేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీని నముకున్నవారికి అండగా ఉంటుందనడానికి నిదర్శనం మహేశ్ కుమార్ గౌడ్ కి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవి రావడమేనని అన్నారు. కార్యక్రమంలో నందిపేట మండల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
