బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఈ ఏడాది సెప్టెంబర్ 6న వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడప ప్రకాష్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. నిమజ్జన శోభాయాత్రలో పట్టణంలోని అన్ని గణేష్ మండపాల నుండి విగ్రహాలను ఘనంగా ఊరేగింపుగా తీసుకువెళ్ళనున్నారు. శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గణపయ్యను నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
