27.5 C
Hyderabad

పీసీసీ చీఫ్ ను కలిసిన  ఐఎన్టీయూసీ నాయకులు

INTUC leaders met the PCC chief

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఐఎన్ టీయూసీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఐఎన్టీయూసీ 327 విద్యుత్ ఉద్యోగుల ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎడ్ల నాగరాజు, పసుల మనోహర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెణుగోపాల్, పూదరి గంగాధర్ లు టీపీసీసీ చీఫ్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. నిజామాబాద్ నగరంలో నిర్మిస్తున్న ఐఎన్ టీయూసీ భవన నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అనుబంధ సంఘం కార్యాలయం ను ఇప్పటి వరకు యూనియన్ డబ్బులతో నిర్మిస్తున్నామని, నిధుల కొరత ఉందని ఎమ్మెల్సీ ఫండ్ ఇప్పించాలని కోరారు. దానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  సానుకూలంగా స్పందించారని తెలిపారు.

More articles

Latest article