కారులో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
కామారెడ్డి, బతుకమ్మ : తాళాలు వేసి ఉన్న ఇండ్లను కారు (నెంబర్ ప్లేట్ మార్చిన) లో వచ్చి చూసి చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్రదొంగను అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యలయంలో విలేఖరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.... ఆగస్టు 25న కామారెడ్డి పట్టణంలో మాసిరెడ్డి శివ అనే వ్యక్తి తన ఇంటిలో చోరీ జరిగిన విషయంపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు...