27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • నిందితులంతా పాత నేరస్తులే
  • కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్ దొంగతనాలకు పాల్పడిన నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 26న భిక్నూర్ గ్రామంలో భిక్నూర్ బాయ్స్ హై స్కూల్ ప్రక్కన గల దత్తాత్రీ బాంబు మర్చంట్  షాప్ వద్దకు అక్కడ ఒంటరిగా ఉన్న ఊరె లక్ష్మీ అనే మహిళా అయిన పిర్యాదిరాలు వద్దకు వచ్చి షాప్ పేరు పై లోన్ ఇప్పిస్తా అని మాయ మాటలు చెప్పి ఆమె ఒంటిపై గల మూడు తులాల బంగారు పూస్తేలతాడు ను దొంగిలించారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  విచారణలో భాగంగా భిక్నూర్ పోలీసు అధికారులు బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాలని పరిశీలించి ఆధారాలను సేకరించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం కామారెడ్డి ఎఎస్పీబి. చైతన్యారెడ్డి పర్యవేక్షణలో భిక్నూర్ సీఐ, సిసిఎస్ ఇన్స్పెక్టర్, భిక్నూర్ ఎస్‌ఐ, సిబ్బంది తో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగించారు.  కేసుకు సంబంధించి టోల్ గెట్ వద్ద ఒకరిని, కామారెడ్డిలో ముగ్గురిని మొత్తం నలుగురుని అనుమానితులుగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో భాగంగా నిందితులు తన నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడు, రెండు కార్లు, ఒక బైక్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  ఈ వ్యక్తులు పై కేసుతో పాటు ఇదే సంవత్సరం జనవరి నుండి అదిలాబాద్, సిద్దిపేట,హైదరాబాద్,నిర్మల్, కామారెడ్డి జిల్లాలో గల పోలీస్ స్టేషన్ పరిదిలో దొంగతనాల కి పాల్పడిన 8 నేరాలకు సంబంధించిన వాటిని కూడా ఒప్పుకున్నారు.  ఇవే కాకుండా ప్రదాన నిందితుడు ఆఫ్తాబ్ అహ్మద్ షేక్  గతం లో తెలంగాణ రాస్ట్రం లో వివిద జిల్లాలో దాదాపు 60 వరకు దొంగతనాలు అటెన్షన్ డైవర్షన్ దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లో జైల్ కు కూడా వెల్లి వచ్చాడు. ఇతని గురించి గురించి అదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్,సిద్దిపేట జిల్లాలకు సంబందించిన పోలీస్ లు గాలింపు చేపట్టిన చిక్కలేదు.  ఈ వ్యక్తి గురించి వివిద టీవీ చానెల్లో కూడా దొంగ చిక్కడం లేదు అని పలు రకాల కథనాలు ప్రచురించబడ్డాయిన తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

Interstate robbery gang arrested

More articles

Latest article