అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిందితులంతా పాత నేరస్తులే కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్ దొంగతనాలకు పాల్పడిన నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 26న భిక్నూర్ గ్రామంలో భిక్నూర్ బాయ్స్ హై స్కూల్ ప్రక్కన గల దత్తాత్రీ బాంబు మర్చంట్ షాప్ వద్దకు అక్కడ ఒంటరిగా ఉన్న ఊరె...