24 C
Hyderabad
Sunday, August 2, 2026

బండి భగీరథ్ కు తాత్కాలిక బెయిల్

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ:

ఫోక్సో కేసులో జైల్లో ఉన్న బండి భగీరథ్ కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇంజనీరింగ్ చదువుతున్న బండి భగీరథ్ కు పరీక్ష హజరుకు వారం రోజుల పాటు షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. బండి భగీరథ్ ను మే 16న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం విదితమే. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు, అరెస్టుపై హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. భగీరథ్ కు ఇప్పటికే జ్యూడిషీయల్ కస్టడీ పూర్తయింది నేపథ్యంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా తాత్కలికంగా మంజూరు చేసినట్లు తెలిసింది. దానితో చర్లపల్లి జైలులో ఉన్న బండి భగీరథ్  బెయిల్ పై విడుదల కానున్నారు.

More articles

Latest article