27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ముగిసిన ఇంటర్ పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

  • చివరి రోజు 438 విద్యార్థుల గైర్హాజరు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పరీక్షలు  గురువారం ముగిశాయని, ఐతే ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు 22వ తేదిన ముగుస్తాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. గురువారం రెండవ  సంవత్సరం కెమిస్ట్రీ,  కామర్స్ పరీక్ష లు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. బుధవారంతో మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగియగా,   గురువారం జరిగిన పరీక్షలో మొత్తం 438 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని  తెలిపారు. జిల్లాలో మొత్తం 15,896 మంది విద్యార్థులకు గాను15,458 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు.  మొత్తం 97.2 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.  జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 52 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు,  హై పవర్ కమిటీ, బల్క్ అధికారి, కస్టోడియన్లు  పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షణ చేసారని తెలియజేశారు.  జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ డిచ్పల్లి ప్రభుత్వ  జూనియర్ కళాశాల, డిచ్ పల్లి మోడల్ జూనియర్ కళాశాల,  డిచ్ పల్లి ఎస్.  పి. ఆర్. జూనియర్  జూనియర్  కళాశాల, ధర్మారం సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి  సమీక్షించారు. హై పవర్ కమిటీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో  2 జూనియర్ కళాశాలలు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయుదిన్ అస్లాం, కనకమహాలక్ష్మి 12 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నర్సయ్య, బాలాజీ యమున బృందం 23 పరీక్ష కేంద్రాలను, సిటింగ్ స్కాడ్ బృందాలు ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. బల్క్ అధికారి బుద్ధిరాజ్ నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.

More articles

Latest article