ముగ్గురు డీఎల్ఎస్ఏ  సభ్యుల నియామకం

0 1,288

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ కార్యదర్శి లీగల్ అఫైర్స్ లెజిస్లేటివ్ ఆఫిసర్స్ అండ్ జస్టిస్ ఆర్. తిరుపతి, తెలంగాణ గవర్నర్ ఆదేశానుసారం సోషల్ వర్కర్ గా ఆర్. సురేందర్, న్యాయ రంగం లో ప్రముఖ వ్యక్తిగా జి.రవి ప్రసాద్, డా. కవిత రెడ్డి అను కొత్త సభ్యులుగా  నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసారు. గురువారం జిల్లా ప్రధాన న్యాయాధికారిని సునీత కుంచాల చేతులమీదుగా నియామక పత్రాలను అందచేశారు  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ ఉత్తర్వులు ఏపీ గెజిట్ లో ప్రచురించబడింది అని,  అన్ని జిల్లాల నుంచి ముగ్గురు వ్యక్తులను నియమించామని తెలిపారు. అందులో మన జిల్లా నుంచి ముగ్గుర్ని ఎంచుకున్నామని అన్నారు. న్యాయసేవా సంస్థ లో పాల్గొని సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో సంస్థ సిబ్బంది నాగేందర్, లైజనింగ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.