ఇంటర్ మూల్యాంకనానికి రిలీవ్ చేయని వారి పై చర్యలు

0 1,291
  • జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ 

 

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : 2025 మార్చి ఇంటర్ పరీక్షల మూల్యాంకనం  సంస్కృతం ప్రారంభమైందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ తెలియజేశారు.  ఈనెల 22వ తేదీ నుండి మొదటి స్పెల్, 24 నుండి రెండవ స్పెల్, 26 నుండి మూడో స్పెల్,  28వ తేదీ నుండి నాలుగవ స్పెల్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలియజేశారు. 22 వ తేదీన ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్  సబ్జెక్టు ల మూల్యాంకనం ప్రారంభమవుతుందని, 24వ తేదీ నుండి ఫిజిక్స్, ఎకనామిక్స్, 26వ తేదీ నుండి కెమిస్ట్రీ, కామర్స్,  28వ తేదీ నుండి హిస్టరీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ, ఇతర గురుకుల కళాశాలలో అధ్యాపకుల విధుల ఆర్డర్ కాపీలను కళాశాల లాగిన్లలో నిక్షిప్తం చేయడం జరిగిందని తెలియజేశారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు ఆయా తేదీల వారీగా అధ్యాపకులను రిలీవ్ చేయాలని జిల్లా ఇంటర్ విద్యార్థి ఆదేశించారు.  నాట్ అపాయింట్ లిస్టులో ఉన్న అధ్యాపకులను కూడా వీధుల్లోకి తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు.  22వ తేదీ నుండి ప్రారంభమవుతున్న సబ్జెక్ట్   మూల్య్యాంకనంలో పాల్గొను అధ్యాపకులను శుక్రవారం 21వ తేదీన ప్రిన్సిపాల్ లు రిలీవ్ చేయాలని, 22వ తేదీన అధ్యాపకులు మూల్యాంకన కేంద్రంలో రిపోర్టు చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదేశించారు. ప్రైవేట్ యాజమాన్యాలు, కానీ ఇతర ఏ కళాశాలల ప్రిన్సిపాల్ లు అధ్యాపకులను రిలీవ్ చేయనట్టయితే  బోర్డు నిబంధనల మేరకు వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యాధికారి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.