27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నిత్యం వేధించే బదులు నన్నుఎన్కౌంటర్ చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  •  నిజామాబాద్ నెహ్రూ పార్క్ చౌరస్తాలో యువకుడి హల్ చల్
  • మాజీ మేయర్ భర్తపై హత్యాయత్నం కేసులో నిందితుడు

 

నిజాంబాద్ క్రైo, బతుకమ్మ : నిత్యం వేధించే బదులు నన్ను ఎన్ కౌంటర్ చేయండి అంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపుతోంది. నగరానికి చెందిన షేక్ రసూల్ అనే యువకుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మాజీ మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ పై దాడి చేసిన కేసులో రసూల్ నిందితుడు. తన భూమి కబ్జా చేయడంతో దాడి చేశానని రసూల్ గతంలో పేర్కొన్నారు. ఆ కేసులో అరెస్టయిన రసూల్ రెండు నెలల క్రితం కండిషనల్ బెయిల్ పై బయటకు  వచ్చాడు. అప్పటి నుంచి ఐదో టౌన్ ఎస్ఐ తనను వేధిస్తున్నాడని రసూల్ ఆరోపించాడు. నిత్యం వేధించే బదులు తనను ఎన్ కౌంటర్ చేయాలని ఎస్సైని కోరారు. బుధవారం మధ్యాహ్నం 12గంటలకు నెహ్రూ పార్క్ దగ్గరకు వస్తానని తనను కాల్చి వేయాలని కోరారు. చెప్పినట్లుగానే రసూల్ మధ్యాహ్నం 12గంటలకు నెహ్రూ పార్క్ చౌరస్తాకు వచ్చి తనను కాల్చాలని ఎస్సైకి రసూల్ సవాల్ విసిరారు.

More articles

Latest article