నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకు 2023-24 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అవార్డు లభించింది. స్త్రీ నిధి 12వ సర్వసభ్య సమావేశం బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, స్ర్రీ నిధి ఎం.డీ విద్యసాగర్ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా డీఆర్జీఏ అధికారి సాయగౌడ్ అవార్డును అందుకున్నారు. జిల్లా సిబ్బంది అందరి కృషి వల్ల వరుసగా ప్రతి సంవత్సరం మంచి పెర్ఫార్మన్స్ కనబరుస్తూ అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ఉంటూ ప్రతి సంవత్సరం బెస్ట్ అవార్డు దక్కించుకున్నారు.