27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నందిపేట్‌లో రెండు ఐమాక్స్ లైట్ల ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గ్రామ ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యం

 

నందిపేట్, బతుకమ్మ :

 

ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చొరవతో నందిపేట్ గ్రామంలో రెండు ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలకు రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందించాలనే లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని రామ్‌నగర్ దుర్గాదేవి ప్రాంతంలో ఒక ఐమాక్స్ లైట్, బర్కత్‌పురా ప్రాంతంలో మరో ఐమాక్స్ లైట్‌ను ఏర్పాటు చేశారు. ఈ లైట్ల ఏర్పాటు ద్వారా స్థానికులకు రాత్రి సమయంలో రాకపోకలు సులభతరం కావడంతో పాటు భద్రతా పరంగా కూడా ప్రయోజనం కలగనుంది. ఈ అభివృద్ధి పనుల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తమ నిధుల నుండి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిసింది. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, వారి సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి నందిపేట్ గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు కొనసాగాలని స్థానికులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

More articles

Latest article