ఎడపల్లి, బతుకమ్మ : జిల్లా ఆహార భద్రత అధికారులు టి.సునీత, జి.నవిత ఎడపల్లి మండలం, జానకంపేటలోని ప్రధానమంత్రి జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్‌లలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆహార ముడి పదార్థాల కొనుగోలు బిల్లులను కలిగి ఉండాలనీ ఎండీఎం ఏజెన్సీలకు సూచించారు. నాసిరకం ముడిపదార్థాలను ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

