27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తాండూర్ గ్రామపంచాయతీ రికార్డుల తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నాగిరెడ్డిపేట : మండలంలోని తాండూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి పనులను పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ తో కలిసి  పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ సురేందర్ గ్రామపంచాయతీ అధికారులను సక్రమంగా నిర్వహించాలని, గ్రామంలో ప్రతిరోజు త్రాగునీటి సరఫరా, చెత్త సేకరణ, మురికి కాల్వల పరిశుభ్రత సక్రమంగా జరిగేలా చూడాలని పంచాయతీ కార్యదర్శి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణాలను వేగంగా చేపడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా డిఎల్పిఓ సురేందర్ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సంతోష్ కుమార్, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, కారోబార్ విట్టల్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article