25.4 C
Hyderabad

అనుమతి లేని పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మార్పీఎస్ నాయకులు పోచిరాం

 

బతుకమ్మ, కోటగిరి – ఉమ్మడి మండలంలో  గుర్తింపు లేని ప్రైవేటు  పాఠశాలల్లో  తల్లిదండ్రులు  చేర్చడంతో పిల్లలు ఇబ్బందుల పాలవుతారని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి  సోంపుర్ పోచిరాం  ఆవేదన వ్యక్తం చేశారు..ఈ సందర్బంగా  పోచీరాం మాట్లాడుతూ… అనుమతి ఉన్న ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.సంబంధిత శాఖ అధికారులు వెంటనే అనుమతులు లేని పాఠశాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కొన్ని ప్రవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూలీనాలీ చేసుకుని ప్రైవేట్ బడిలో పిల్లలను పంపిస్తున్నారని వారిని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థలు, స్కూల్ యజమానులు, ప్రభుత్వ నిబంధనలు  ప్రకారమే స్కూల్ ఫీజులు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

More articles

Latest article