తాండూర్ గ్రామపంచాయతీ రికార్డుల తనిఖీ
బతుకమ్మ, నాగిరెడ్డిపేట : మండలంలోని తాండూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి పనులను పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ సురేందర్ గ్రామపంచాయతీ అధికారులను సక్రమంగా నిర్వహించాలని, గ్రామంలో ప్రతిరోజు త్రాగునీటి సరఫరా, చెత్త సేకరణ, మురికి కాల్వల పరిశుభ్రత సక్రమంగా జరిగేలా చూడాలని పంచాయతీ కార్యదర్శి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణాలను వేగంగా చేపడుతూ త్వరితగతిన...