నిజామాబాద్,బతుకమ్మ : ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీసు శిక్షణ కేంద్రాన్ని సోమవారం సీసీ సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రాబోయే శిక్షణార్థులకు అనుకూలంగా ఉండే విధంగా అవసరమైన సౌకర్యాలు , వసతులు అందుబాటులో ఉండాలని ఆయన సిబ్బందికి ఆదేశించారు. పోలీస్ శిక్షణ సెంటర్ భవిష్యత్ పోలీస్ అధికారుల పాత్రను తీర్చిదిద్దే కేంద్రమన్నారు. శిక్షణా పరికరాలు , శిక్షకులు, తగిన వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. సెంటర్‌లో వసతులు , ట్రైనింగ్ సెంటర్ గదులు, వంటశాల , నీటి సరఫరా , శౌచాలయాలు , ఇండోర్ తరగతి గదులు , అవుట్ డోర్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ తదితర అంశాలను పరిశీలించారు. తక్షణమే కొంతమేర మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు , ఎడపల్లి ఎస్సై ఎమ్. రమ మరియు ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

