పోలీస్ శిక్షణ సెంటర్ పరిశీలన
నిజామాబాద్,బతుకమ్మ : ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీసు శిక్షణ కేంద్రాన్ని సోమవారం సీసీ సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రాబోయే శిక్షణార్థులకు అనుకూలంగా ఉండే విధంగా అవసరమైన సౌకర్యాలు , వసతులు అందుబాటులో ఉండాలని ఆయన సిబ్బందికి ఆదేశించారు. పోలీస్ శిక్షణ సెంటర్ భవిష్యత్ పోలీస్ అధికారుల పాత్రను తీర్చిదిద్దే కేంద్రమన్నారు. శిక్షణా పరికరాలు , శిక్షకులు, తగిన వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. సెంటర్‌లో వసతులు , ట్రైనింగ్ సెంటర్ గదులు, వంటశాల...