24 C
Hyderabad
Sunday, August 2, 2026

రైళ్ళలో సెల్ ఫోన్ చోరిలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

రైళ్లలో సెల్ ఫోన్ చోరిలకు పాల్పడుతున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్ మీద రైల్వే పోలీసులు, ఆర్ పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమాస్పదంగా కనపడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాందేడ్ జిల్లా హిప్పరగా తాడి గ్రామానికి చెందిన ధర్మాజి నాగోబోయి అంకేశ్వర్ అనే యువకుడు తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్ళు కృష్ణ ఎక్స్ ప్రెస్ లో 3 మొబైల్ ఫోన్లు, గత మూడు నెలల క్రింద ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ లో ఒక మొబైల్ ఫోన్ ను దొంగతనం చేసినట్టు తెలిపారు. అతని వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని, కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎస్సై తెలిపారు.

More articles

Latest article