27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో క్యాంప్ కార్యలయం నందు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ హౌసింగ్ పథకం అమలు, గ్రామీణ పారిశుద్ధ్య సమస్యలు, మిషన్ భగీరథ పనుల పురోగతి తదితర అంశాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి గ్రామ పంచాయతీలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ పథకం కింద గ్రామాలకు నీటి సరఫరా సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజలకు నీటి తాకిడి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో, డీఎల్పీఓ, ఎంసీపీడీఓ, (ఈఈ), ఎమ్మార్వోలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ), పంచాయతీ సెక్రటరీలు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Indiramma should speed up the construction of houses

More articles

Latest article