ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో క్యాంప్ కార్యలయం నందు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ హౌసింగ్ పథకం అమలు, గ్రామీణ పారిశుద్ధ్య సమస్యలు, మిషన్ భగీరథ పనుల పురోగతి తదితర అంశాలపై ఎమ్మెల్యే...