25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • సీపీఎం నగర కార్యదర్శి సుజాత

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో గుడిసెలు వేసుకొని  నివసిస్తున్న నిరుపేదలందరికీ పట్టాను ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం నగర కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నగరంలో  ఇందిరమ్మ కమిటీలో వేసి ఇంటి నిర్మాణం చేపట్టే విషయంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని,   వీటి వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి కాకుండా  కౌన్సిలర్లకు, బినామీలుగా ఉన్న వాళ్లకు వారి చేతి కింద ఉన్నటువంటి వాళ్లకు తప్ప నిజమైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందట్లేదని అన్నారు. వీటి పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. లేదంటే రేపు రానున్న రోజుల్లో   పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని  సిపిఎం నగర కార్యదర్శి  బెజ్గం సుజాత ప్రభుత్వాన్ని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు  భీమశంకర్, యశోద, పంచ పూల, రజియా, సురేఖ, సారిక, సంగీత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article