25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రధాన రహదారిపై బీజేపీ నాయకుల రాస్తారోకో

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రం లో చౌరస్తా సమీపంలో బిజెపి నాయకులు సోమవారం రాస్తారోకో చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూరపై అనుచిత  వ్యాఖ్యలకు నిరసనగా సిఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కాపాడుతుంటే దేశంలోనే ఒక వర్గం వ్యక్తులు వారి సేవలను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని వారు స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూరపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి 140 కోట్ల జనాభాకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అత్తిలి తిరుమలేష్ పొన్నాల రంజిత్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, సిద్దు, నర్సింలు, జిల్లా నాయకులు యాదగిరి గౌడ్, పవన్ కుమార్, హరేంద్ర, రవీందర్ రెడ్డి గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు ఉన్నారు.

BJP leaders' graffiti on the main road

More articles

Latest article