నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
సీపీఎం నగర కార్యదర్శి సుజాత నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న నిరుపేదలందరికీ పట్టాను ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం నగర కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నగరంలో ఇందిరమ్మ కమిటీలో వేసి ఇంటి నిర్మాణం చేపట్టే విషయంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని, వీటి వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి కాకుండా కౌన్సిలర్లకు,...