. . . జిల్లా క్షయ నియంత్రణ అధికారి దేవి నాగేశ్వరి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
2030 సంవత్సరం కల్లా భారత దేశంలో ఒక్క క్షయ వ్యాధిగ్రస్తుడు లేకుండా టిబి ముక్తభారత్ గా మార్చడం మన అందరి లక్ష్యమని జిల్లా క్షయ నియంత్రణ అధికారి దేవి నాగేశ్వరి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పీహెచ్సి లోని వైద్యాధికారులకు క్షయ నియంత్రణలో భాగంగా గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఫరెన్షియల్ టిబి కేర్ మాడ్యూల్, సై – టీబీ, క్షయ రహిత గ్రామపంచాయతీ అనే అంశాలపై చర్చించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయ నిర్ధారణ అయిన రెండు నెలల లోపు ఎక్కువ మరణాలు జరుగుతున్నాయని, వారికి వివిధ రకాలైన నిర్ధారణ పరీక్షలు చేసి రెడ్ ఫ్లాగ్ లో పెట్టాలని అన్నారు. అదే విధంగా అనుమానితా క్షయ రోగులకు సై టీబి ఇంజక్షన్ ఇవ్వాలని తెలిపారు. అదే విధంగా క్షయ రహిత గ్రామపంచాయతీలుగా జిల్లాలో 22 గ్రామపంచాయతీలను గుర్తించామని పేర్కొన్నారు. అదే విధంగా ప్రతి గ్రామంలో టీబి ముక్త భారత్ పై విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీకాల నియంత్రణ అధికారి డాక్టర్ అశోక్, పిఓఎన్ సిడి డాక్టర్ వెంకన్న, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓలు డాక్టర్ రవీందర్, డాక్టర్ అశ్విని, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సుప్రియ, డాక్టర్ శిఖర, కోఆర్డినేటర్ నరేష్, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, డిపిఓ విశాల, వివిధ పిహెచ్ సి ల వైద్యాధికారులు పాల్గొన్నారు.
