- ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్
భీమ్ గల్, బతుకమ్మ : మహిళల ఆర్ధిక సాధికారత కోసం ప్రభుత్వం ఐ కే పీ ద్వారా ఇస్తున్న శ్రీనిధి, ఇతర మహిళా రుణాలను తీసుకొని, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆర్థికంగా ఎదగాలని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన మండల మహిళా సమాఖ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు బ్యాంకు లింకేజీ శ్రీనిధి లోను తీసుకొని ఆదాయ అభివృద్ధి మార్గాలు ఎంచుకొని, లాభాలు అర్జించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు స్త్రీ నిధి ద్వారా ఇల్లు నిర్మించాకోడానికి ఆర్ధిక సహాయం చేసి లోన్ అందించాలని కోరారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు సీజనల్ వ్యాధులపై అంటూ రోగాల నివారణ పై అవగాహనా కల్పించి, ఇంటి పరిసరాలు, ఇంట్లో నిలువ నీటిని పారబోయించాలని కోరారు.ఆరోగ్యంపై అవగాహన పెంచుకొని రోగాలను దూరం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఏపీఎం రవీందర్, సీ సీ లు శ్రీనివాస్ నరేష్ లలిత, వి ఓ ప్రెసిడెంట్లు, మండల సమాఖ్య సభ్యులు,మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
