24.2 C
Hyderabad

ఆగని ఇసుక అక్రమ రవాణా

Must read

📰 Generate e-Paper Clip

  •  అటువైపు చూడని రెవెన్యూ, పోలీస్ అధికారులు
  •  పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు

రుద్రూర్, బతుకమ్మ  : ఇసుక మాఫియా రోజులు రోజుకు రెచ్చిపోతుంది.. కొందరు అక్రమార్కులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుకను ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రుద్రూర్ గ్రామం మీదుగా అంబం, బొప్పాపూర్, వర్ని వైపు ప్రతి రోజు పదుల సంఖ్యల్లో ఎలాంటి వే బిల్లులు, నెంబర్ ప్లేట్ లు లేకుండా యాథెచ్చగా ట్రాక్టర్ లలో ఇసుక అక్రమ రవాణా చేపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా పై అధికారయంత్రాంగంలో చలనం లేక పోవటం గమనార్హం. రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి ముడుపులు చెల్లిస్తూ ఇష్టానుసారంగా తరలిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్లు రహదారులపై అతి వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారని స్థానిక ప్రజలు, వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article