24.7 C
Hyderabad
Monday, August 3, 2026

డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని సూచించారు. మంచి సమాజా నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉపాధ్యాయ వృత్తి నిబద్దతతో పనిచేస్తూ న్యాయమైన సామాజిక అంశాల పట్ల కూడా స్పందించాలని అన్నారు. సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య, ప్రధాన కార్యదర్శి కే. ఒమాజీ, సీనియర్ నాయకులు యల్.శ్రీధర్, ఉపాధ్యక్షులు పి.దాసు, రామదాసు, రాష్ట్ర కౌన్సిలర్ నాగరాజు, జిల్లా కార్యదర్శి రాసరి పెంటన్న, విజయ్ కుమార్ జనార్ధన్, గట్టు ఈశ్వర్ ఆనంద్ ,కిషన్, బాల్ రాజ్,, లింగo, గంగారం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article