డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని సూచించారు. మంచి సమాజా నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉపాధ్యాయ వృత్తి నిబద్దతతో పనిచేస్తూ న్యాయమైన సామాజిక అంశాల పట్ల కూడా స్పందించాలని అన్నారు. సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు...