నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఐదో డివిజన్ లోని బోర్గాం (పి ) శ్రీ సాయి లక్ష్మీ నగర్ లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ద్వారా మంజూరు చేయబడ్డ నాలుగు లక్షల ఎంపీల్యాడ్ నిధుల ద్వారా పూర్తిచేసిన ‘ఓపెన్ జిమ్’ స్థానిక కార్పొరేటర్ సందగిరి సౌజన్య రాజశేఖర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అదేవిధంగా మరో నాలుగు లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేసారు.

అంతేకాకుండా కాలనీ వాసులు అందరూ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓపెన్ జిమ్ సేవలను కాలనీ వాసులు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. కాలనీ సభ్యులందరూ కలిసి సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. కాలనీ అభివృద్ధికి సహకరించిన ఎంపి అరవింద్ ధర్మపురికి, కార్పొరేటర్ సందగిరి సౌజన్య రాజశేఖర్ రెడ్డి కి కాలనీవాసులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఈగ శ్రీనివాస్ రెడ్డి, నారాయణ, కోశాధికారి వినోద్, కాలనీ సభ్యులు బంటు దాసు, సందీప్, రజిన్, చంద్రు నాయక్, కిషన్, పల్లె శీను, శ్రీధర్, నాగప్ప, వెంకటేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

