- ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ప్రభాకర్
సిరికొండ, బతుకమ్మ : వడగండ్ల వానవల్ల ఇటీవలె నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏ ఐ కే యు ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ వి. ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలోని కొండూరు, తదితర గ్రామాల్లో వడగళ్ళ వాన వల్ల పంట రాలిపోయి నష్ట పోయిన పంటలను ఏఐయుకేఎస్ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు వడగళ్ల వానతో మండలంలోని రైతులు పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయారన్నారు. అసలే భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయి లబో దిబోమంటుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు వడగళ్ల వాన తో రైతును మరింత నష్టం చేసిందన్నారు. నోటికి వచ్చిన పంట ఇక చేతికొస్తుందని గంపెడాశతో ఉన్న రైతాంగం నోట్లో మట్టి కొట్టినట్లుగా పకృతి విలయతాండవంతో రైతుని పూర్తిగా ముంచిందన్నారు. ఈ మండలంలో గత నాలుగేల్లుగా ప్రతి సంవత్సరం వడగండ్ల వానతో నష్టపోయిన గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నాయన్నారు. సిరికొండ మండలంలో మొత్తం 500 నుండి 1500 ఎకరాల వరకు పంటలు నష్టపోయాయన్నారు. మామిడి తోటల్లో కూడా మామిడికాయ రాలిపోయి రైతాంగం తీరమైన ఆర్థిక ఇబ్బందుల గురయ్యారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నష్టపోయిన రైతాంగానికి ఇతరైన 70 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. నష్ట పరిహారంతో పాటు రుణమాఫీ, రైతు భరోసా అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొండూరు గ్రామంలో వరి సీడ్స్ అందజేసి,మోసం చేసిన గంగా కావేరి సీడ్స్ యజమానియంపై చట్టరీత్యా చర్యలు తీసుకొని నష్టపోయిన రైతాంగానికి రావాల్సిన డబ్బులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక కంపెనీ నుండి అందించిన సీడ్స్ 120 రోజుల్లో పంట చేతికొస్తదని నమ్మించారని, 140 రోజులు అయిన ఇంకా పంట చేతికి రాలేదన్నారు. సీడ్స్ కంపెనీ యజమాన్యం రైతాంగం పై శఠగోపం పెట్టారని, నిండా ముంచారన్నారు. సరైన సమయంలో వస్తావనుకున్న వరి ధాన్యం మీరు మోసం వల్ల చేతికి రాకపోవడంతో ప్రస్తుతం వడగండ్ల వాన వల్ల పూర్తిగా రాలిపోయి దెబ్బతింది అన్నారు. నష్టాన్ని పూర్తిగా సీడ్స్ యజమాన్యమే భరించాలన్నారు. పరిశీలన బృందంలో ఏ. ఐ. పి. కే. ఎం. ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, ఏ.ఐ.యు.కే.ఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవరాం,జిల్లా సహాయ కార్యదర్శి బి బాబాన్న సిపిఐ(ఎంల్) మాస్ లైన్ డివిజన్,మండల నాయకులుబి కిషన్ సిపిఐ(ఎంల్) మాస్ లైన్ ఎం. డి.అనిస్ ,బి కిషోర్, ఎస్.కిషోర్, రైతులు జనార్దన్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
