నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి

ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ప్రభాకర్   సిరికొండ, బతుకమ్మ : వడగండ్ల వానవల్ల ఇటీవలె నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏ ఐ కే యు ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ వి. ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలోని కొండూరు, తదితర గ్రామాల్లో వడగళ్ళ వాన వల్ల పంట రాలిపోయి నష్ట పోయిన పంటలను ఏఐయుకేఎస్ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు  వడగళ్ల వానతో  మండలంలోని రైతులు  పంటలు తీవ్రంగా  దెబ్బతిని నష్టపోయారన్నారు....