- ఐకేపీ డీపీఎం సాయిలు
భీమ్ గల్, బతుకమ్మ : మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డిపిఎం సాయిలు అన్నారు.శనివారం భీంగల్ మండల కేంద్రంలోని భీమ్ గల్ మండల సమైక్య కార్యాలయంలో మానవ అక్రమ రవాణా నిరోధికతపై గ్రామ సంఘం అధ్యక్షులు,వివోఏ లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ పని చేతకాని వారు సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాలావాట్ల వల్ల మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అన్నారు . దీనిపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోజువారి దినచర్యలో పిల్లలను ఎప్పటికప్పుడు గమనించాలని మహిళలకు సూచించారు. మానవ అక్రమ రవాణా ద్వారా లైంగిక దోపిడీ,అవయవ దోపిడీ ల పట్ల మహిళలకు చైతన్యం చేయాలని కోరారు.గ్రామ సంఘం అధ్యక్షులు గ్రామాలలో ప్రతి సంఘం సమావేశంలో ఈ అంశాన్ని మహిళలకు అవగాహన కల్పించాలని కోరారు. సైబర్ ఆధారిత అక్రమ రవాణా, లైంగిక వేధింపులు,రవాణా చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సెర్ప్ అధికారులు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్, గంగ సాయిలు, రఘు, భాస్కర్ , గంగాధర్ , సుమలత, గంగా లలిత, గణేష్ , ముత్యం, అరుణ,మహిళా సంఘాల అధ్యక్షురాలు మరియు వివోఏలు పాల్గొన్నారు.
