అనుమతి లేని నిర్మాణంపై తక్షణ చర్యలు తీసుకోవాలి

0 8,786

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రోడ్డును ఆక్రమించుకుని ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీఆర్ టి కాలనీ వాసులు అన్నారు. ఈ విషయమై మంగళవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.

 

Immediate action should be taken against unauthorized construction

 

పట్టణంలోని 50వ డివిజన్, గాజులపేట్ లోని టిఆర్ టి కాలనీ లో లక్ష్మీనరసింహ మొబైల్ షాప్ పక్కన గల స్థలంలో ఓ వ్యక్తి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా రోడ్డును ఆక్రమించుకొని ఇల్లు నిర్మిస్తున్నాడని, దాని వల్ల స్థానిక కాలనీవాసులకు, రోడ్డు పై నడిచే పాదచారులకు ఇబ్బందికరంగా మారిందని వారన్నారు. రోడ్డును ఆక్రమించుకుని మరి కడుతున్న ఈ కట్టడంపై తక్షణమే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

 

Immediate action should be taken against unauthorized construction

Leave A Reply

Your email address will not be published.