13మందికి 5ఏళ్ల కఠిన కారాగార శిక్ష

0 19,851
  • ముద్దాయిలు మునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు
  • నాయక్ పోడ్ కులస్తుల సామాజిక బహిష్కరణ కేసు
  • నిజామాబాద్ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల పై అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ తీర్పు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలోని మునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పదమూడు మందికి ఐదు సంవత్సరాల చొప్పున రెండు కారగార శిక్షలు,ఇద్దరికి రెండు వందల రూపాయల చొప్పున జరిమానా విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల పై అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పులోని వివరాలు. కోర్టు నేర న్యాయ విచారణలో భాగంగా సాక్షుల సాక్ష్యాలు నమోదు చేసుకుని, ధ్రువీకరించుకున్న పత్రాలు అధ్యయనం చేసిన అనంతరం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలోని మునిపల్లి గ్రామ సర్పంచ్ సాయిరెడ్డి, ఎమ్. పి. టి. సి తిరుపతి రెడ్డి ల ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు టంకశాల నరేష్, గాజుల లింగన్న,కొలిపాయక సాయిరెడ్డి, ముస్కు గంగారెడ్డి, గుమెర్ల మల్లయ్య, మర్రిపల్లి పొట్టెన్న, బాంపల్లి రాజేందర్, గుడ్ల మోహన్, గొల్ల చవుల బాజన్న, అరే గంగారామ్,గుమ్ముల సాయన్న, చింతలపల్లి గంగారెడ్డి, చింతలపల్లి పెద్ద సాయిరెడ్డి, గుండేటి లింగన్న, కొలిప్యాకల సాయరెడ్డి, గొర్రకంటి గంగ సాయిలు లతో కలిసి 23 నవంబర్, 2021న సమావేశం నిర్వహిస్తుండగా అట్టి సమావేశానికి అదే గ్రామానికి చెందిన నాయక్ పోడ్ కులస్తుడైన తుమ్మ రవీందర్ తన కులం వారితో కలిసి అక్కడికి వెళ్లారు. మునిపల్లి గ్రామంలో శివాలయంకు వెళ్లే దారి కబ్జాకు గురైన విషయంలో తోవ చూపించమని విడిసి సభ్యులను వేడుకున్నారని కాని, విడిసి వారే నాయక్ పోడ్ కులస్థులకు పదిహేను వేల రూపాయల జరిమానా విధించారు.ఈ విషయాన్ని మల్లి విడిసి దృష్టికి తీసుకువెళ్తే వారు నాయక్ పోడ్ కులస్థుల వ్యవసాయ పనులకు ట్రాక్టర్ లను పంపించకపోవడం, వరికోతకు మిషన్ లను నిరాకరించడం, కూలీలను పనులకు పోవద్దని చెప్పడం, దసరా పండుగ రోజు జంభిచెట్టును నాయక్ పోడ్ వారితో కాకుండా వేరే గ్రామానికి చెందిన వారితో కొట్టించడం, భీమన్నఉత్సవాలలో భాగంగా కుమ్మరి కుండలు ఇవ్వకుండా అడ్డుకోవడం, అన్నదానం రోజున అన్నదానానికి వెళ్ళవద్దని గ్రామస్తులను ఆదేశించారు, నాయక్ పోడ్ కులస్థులను అవమానించారు.గ్రామస్తులు మాట్లాడకుండా కట్టడి చేశారు.సదరు నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడం మూలంగా ఐదవ ముద్దాయి గుమెర్ల మల్లయ్య, అరే గంగారామ్ లకు ఎస్. ఎస్టీ చట్టం వర్తించనందున వారికి ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 290 ప్రకారం రెండు వందల రూపాయల జరిమానా విధించారు, జరిమానా కట్టని యెడల ఏడు రోజుల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.మిగతా ముద్దాయిలు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారు కానందున వారికి షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల పై అత్యాచారాల నిరోధక చట్టంలోని రెండు సెక్షన్ ల ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఒకనెల జైలుశిక్ష అనుభవించాలని స్పెషల్ జడ్జి శ్రీనివాస్ తమ తీర్పులో పేర్కొన్నారు….పదకొండవ ముద్దాయి గుమ్ముల సాయన్న కేసు విచారణ దశలో ఉండగానే మృతి చెందారు.

  • ఇది రెండవ తీర్పు…

గ్రామ అభివృద్ధి కమిటీ ల చట్ట వ్యతిరేక చర్యలపై, సామాజిక వెలివేతలపై స్పెషల్ కోర్టు వెలువరించిన రెండవ తీర్పు.జక్రాన్ పల్లి మండలంలోని కొలిప్యాక గ్రామ జన సంగం పదిహేను మంది సభ్యులకు గతంలో జైలుశిక్ష విధించారు. ఇది విడిసి ల చట్ట వ్యతిరేక కార్యమాలపై రెండవ తీర్పు. కోర్టు తీర్పులు గ్రామ అభివృద్ధి కమిటీలకు కనువిప్పు కాగలదా..?. వేచి చూడవసిందే.. కోర్టు కన్విక్షన్ వారంట్ స్వీకరించిన పోలీసులు ముద్దాయిలందరిని జిల్లా కేంద్ర కారగారానికి తరలించారు.మల్లయ్య, గంగారామ్ జరిమానా చెలించడంతో వారిని విడిచి పెట్టారు. మిగతా ముద్దాలు ఐదు సంవత్సరాల పైబడి శిక్షలున్నందున హైకోర్టు లో అప్పీలు చేసుకుని బెయిలు పొందడానికి చట్ట వీలు కలిపిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.