27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కేటీఆర్ పై అక్రమ కేసు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమంగా ఎసిబి కేసు పెట్టడాన్ని ఏర్గట్ల  మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఫార్ములా – ఈ రేస్ ను ప్రపంచంలోనే అనేక గొప్ప నగరాలను కాదనుకొని హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ ది అని అన్నారు. ఫార్ములా – ఈ రేస్ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కొత్త ప్రభుత్వం రాగానే కక్ష్యపూరితంగా ఈ రేస్ ను రద్దు చేసిందన్నారు. రద్దు చేయడమే కాకుండా ఈ రేస్ నిర్వహణలో అవినీతి జరిగింది అంటూ  ఈ రేస్ ను పావుగా వాడుకొని కేటీఆర్ పై బురద జల్లడానికి అక్రమ కేసు బనాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఆయిన ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని తెలిపారు.  కేటీఆర్ ని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అని ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా కేసు పెట్టించడం విడ్డూరంగా ఉందన్నారు. హామీల అమలుపై  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రశిస్తున్నందునే కేటీఆర్ అడ్డులేకుండా చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని అన్నారు. అక్రమ కేసులు బనాయించి రాక్షస ఆనందం పొందుతున్నాడు. ఫార్ములా – ఈ రేస్ పై లీకులు ఇవ్వడం కాదు అసెంబ్లీ లో చర్చ పెట్టండి పూర్తిగా చర్చించడానికి నేను సిద్ధం అని కేటీఆర్ అంటుంటే ప్రభుత్వం చర్చకు రాకుండా పారి పోవడాం కాకుండ అబద్ధపుప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం, గ్రామ పార్టీ అధ్యక్షుడు దేవుడు నరసయ్య, డాక్టర్ మధు, సిగ సారం గంగారాం,తాళ్ల రాంపూర్ మాజీ ఉపసర్పంచ్ దేవేందర్ , కటకం సాగర్ రెడ్డి, జైనుద్దీన్, అశ్రఫ్, రోక్కేడ మోహన్, అట్లా పోశయ్య, గన్నారపు రాజేశ్వర్, మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article