మెడికల్ కళాశాలలో అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలి

0 1,563
  • విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముట్టడి
  • అడ్డుకున్న పోలీసులు.. కళాశాల ముందు బైఠాయింపు

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇటీవల భర్తీ చేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలలో అవకతవకలు జరిగాయని, అక్రమ నియామకాలు చేశారని వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మెడికల్ కళాశాలలను ఎస్ఎఫ్ఐ, బీవీఎం, జీవీఎస్, బిడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ముట్టడించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కళాశాల ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో చేసిన ఉద్యోగ నియామకాల్లో పూర్తిగా అక్రమ నియామకాలు చేశారని అన్నారు. ఇదే విషయమై గతంలో అప్లై చేసుకున్న నిరుద్యోగులు కలెక్టర్ను ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి పిర్యాదు చేసారు. దింతో ఎస్సీ ఎస్టి కమిషన్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కకొత్త నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు మళ్లీ స్వీకరించాల్సి ఉండగా పాత నోటిఫికేషన్ నుంచి స్వీకరించిన దరఖాస్తుల ద్వారానే స్వీకరించారు.దింతో అర్హులైన వారికి ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు అన్యాయం జరిగింది.ఈ ఈ నియమ కలలో సైతం నిబంధనలు బేకాతర్ చేశారు. నియామక పత్రాలు అందించి మెరిట్ లిస్టు వేయడం పై జిల్లా ఉన్నత అధికారులు కళాశాల ప్రిన్సిపాల్ నిరుద్యోగులకు సమాధానం

Illegal appointments in medical colleges should be cancelled immediately

ఇవ్వాలన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు కొన్ని సర్టిఫికెట్ కు సంబంధించి మార్పులు చేర్పులు చేశారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. వాటిపై సమగ్ర విచారణ జరిపి ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరి ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నాం.  మెడికల్ కళాశాల పనిచేస్తున్న ఉద్యోగస్తుల బంధువులను నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు  పొందిన వారి నుండి లక్షలాది డబ్బులను తీసుకొని ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి మరికొందరి దగ్గర డబ్బులు తీసుకొని మధ్యవర్తుల ద్వారా రిటర్న్ ఇవ్వడం జరిగిందన్నారు.న్యాయపరంగా అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా డబ్బులు ఎక్కువ ఇచ్చేవారికి ఉద్యోగాలు ఇస్తామని ఫోన్ల ద్వారా సంప్రదించారని కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్వాహకులు పై ఆరోపిస్తున్నారు.ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న కళాశాల ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసి విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.అక్రమ నియమకులపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కళాశాల ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి  ఏజెన్సీ రద్దు చేసే వరకు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీవీయం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదం అరుణ్ కుమార్. గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్. బిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేందర్ , నిమ్మ సురేష్ ,మణికంఠ ,అర్బస్ ఖాన్, ప్రభాకర్, మణికంఠ, రాహుల్ ,శివ ,శ్రావణ్, అజయ్ తదితర విద్యా సంఘ నాయకులు పాల్గొన్నారు.

Illegal appointments in medical colleges should be cancelled immediately

Leave A Reply

Your email address will not be published.