దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా అర్వింద్

0 15,492
  • బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే
  • నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

సిరికొండ, ధర్పల్లి, బతుకమ్మ :  గత నెల 28 న భారీ వర్షాలు పడడంతో ధర్పల్లి మండలం లోని వాడి గ్రామనికి పెద్ద ఎత్తున వరద వచ్చి చాలా అస్తి నష్టం జరిగింది. దొంగలు పడ్డక కుక్కలు మొరిగినట్లు అంత అయిపోనంక  వాడి గ్రామానికి వెళ్లి ఎం పి అర్వింద్ వెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం పైన బురద చల్లడం మంచిది కాదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.  వరద నష్టం పైన పంట, కరెంట్, ఇరిగేషన్,రోడ్డు ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి కేంద్రానికి పంపుతమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. అపుడు నీకు దమ్ము వుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నిజామాబాదు నియోజకవర్గం సిరికొండ,ధర్పల్లి మండలంలోని  పెద్ద వాల్గొట్, చిన్న వాల్గొట్, కొండూరు, గాడ్కోల్, పాకాల,తుంపల్లి, వాడి, నడిమి తండా  వరద భాదితులను నిజామాబాద్ రూరల్ డాక్టర్ భూపతి రెడ్డి పరామర్శించారు. వరద భాదితులను అందరిని ఆడుకుంటున్నామని, వారికి నిత్యావసర వస్తువులు బియ్యం, పప్పులు, బట్టలు ఇస్తున్నామని అన్నారు. ఇండ్లు కూలిపోయినవారి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వరద భాదితులను అన్ని విధాలుగా ఆడుకోంటామని అన్నారు.ఇప్పటికి  అన్ని శాఖల అధికారులు ప్రాథమికంగా వరద నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వనికి పంపించారాని అన్నారు.నష్టం పరిహారం రాగానే భాధితులకీ ఇస్తామని అన్నారు. గ్రామాల్లోని వరద భాదితులను ప్రతి ఒక్కరిని మాట్లాడిస్తు, వారికి ధైర్యం చెప్పారు, అన్ని రకాలుగా ఆడుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట పీసీసీ డెలికెట్ శేఖర్ గౌడ్,డీసీసీ డెలికెట్ భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్,  రవి, బాలరాజ్, మాజీ ఎంపీటీసీ ఎర్రన్న, నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్,సీనియర్ నాయకులు రాజారెడ్డి, సాయిలు, రాము,ప్రవీణ్ రెడ్డి,వివిధ గ్రామం శాఖ అధ్యక్షులు నర్సారెడ్డి,  గోవర్ధన్ రెడ్డి, కిషోర్,శ్రీధర్,కాంగ్రెస్ కార్యకర్తలు,వివిధశాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

If you have the courage, bring funds from the center, Arvind

Leave A Reply

Your email address will not be published.