అలరించిన చిన్నారుల వేషధారణ

0 14,541

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శ్రీ శ్రీ శ్రీ దుర్గామాత ఆలయంలో గుమస్తా కాలనీలో నిర్వహించిన చిన్నారుల వేషధారణ భక్తులను అలరించాయి.  చిన్నారులు కృషుడు, గణపతి, పోతారాజు, అన్నపూర్ణ దేవి, గోపిక వంటి పలు వేషధారణల్లో పాల్గొని భక్తులను అలరించారు. పిల్లల అమాయక హావభావాలు, అందమైన వేషధారణలు చూసి భక్తులు మంత్ర ముగ్దులయ్యారు. సాంప్రదాయ విలువలను చిన్న వయసులోనే నేర్పించే ఈ తరహా కార్యక్రమాలు తల్లిదండ్రులు, పెద్దల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. ఆలయ వాతావరణం భక్తి, ఆనందం, సాంస్కృతిక కాంతులతో నిండిపోయింది. ఈ సందర్బంగా ఆలయ అధ్యక్షులు ఆమందు విజయ్ కృష్ణ మాట్లాడుతూ చిన్నారులు మన సంస్కృతి, సంప్రదాయాలను అలవోకగా ఆచరిస్తూ ఈ తరహా వేశధారణల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని కోశాధికారి ధాత్రిక వేణుగోపాల్, గణేష్ కమిటీ అధ్యక్షులు ధాత్రిక గంగసాయి, కార్యదర్శి ధాత్రిక అఖిల్ రాజ్, సభ్యులు హరీష్, ప్రవీణ్,మహిళలు భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.