- జయశంకర్ వ్యవసాయ విద్యాలయం వైస్ ఛాన్స్ లర్ అల్దాస్ జానయ్య
- రెండవ రోజు కొనసాగిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రైతు అనుకుంటే ప్రభుత్వాలను గద్దె నెక్కించగలరు, గద్దె దించగలరని, స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర ఇవ్వాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ అల్థాస్ జానయ్య అన్నారు. రెండవ రోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు నిజామాబాద్ లోని బి ఎల్ ఎన్ గార్డెన్ లో ప్రారంభం కాగ, ఉదయం మాజీ శాసనసభ్యులు ఉజ్జయిని యాదగిరిరావు జెండా ఆవిష్కరణ చేశారు. అమరుల వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. మొదట స్వాగత ఉపన్యాసాన్ని ఆహ్వాన సంఘం అధ్యక్షులు నర్రా రామారావు చేశారు. ఈ సభా కార్యక్రమానికి భాగం హేమంతరావు , ముత్యాల విశ్వనాథం, రవీందర్ రెడ్డి, దేవ భక్తుని సంధ్య, డి.జి నరేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. కౌలు రైతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోపోజిట్ సూర్యనారాయణ అతుల్ కుమార్ అంజాన్ కు, ఈ మధ్యకాలంలో మరణించిన రైతులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయశంకర్ వ్యవసాయ విద్యాలయం వైస్ ఛాన్స్ లర్ అల్దాస్ జానయ్య, అఖిలభారత రైతు సంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయ విశ్లేషకులు సోమర్ల వ్యవసాయ శాస్త్రవేత్త దొంతి నర్సింహారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యకలాపాల నివేదిక పై పశ్య పద్మలు మాట్లాడారు. ఈ మహా సభలను ఉద్దేశించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ అల్థాస్ జానయ్య మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రైతు బాగుంటే, రైతు అభివృద్ది చెందితే దేశం అభివృద్ది చెందుతుందని అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ది అనేది కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి బాధ్యత అన్నారు.

మద్దతు ధర కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. నేను ఒక రైతు బిడ్డనే రైతు కష్టాలు కళ్ళారా చూశానని, వ్యవసాయం పై మూడు దశాబ్దాలకు పైగా అధ్యయనం చేస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలకు పాలకులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. నిత్యం రైతులతో మాట్లాడుతూ వారికి ఉన్న సమస్యల మీద సమస్యల పరిష్కారం కోసం సేవ అందించే అవకాశం రావటం సంతోషంగా ఉందన్నారు. రైతులు వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అందులో ప్రభుత్వంలో పాత్ర ఏమిటి? రైతుల పాత్ర ఏమిటి ? అని విశ్లెషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల సమస్యల మీద ఎంత మాట్లాడినా తక్కువేనని. ఒక సమస్య పరిష్కారం అయ్యే లోపు మరో సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించడం లేదని అన్నారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తులు పెరిగాయని, అందుకు మనం గర్వపడాల్సిన అవసరం ఉందని. మరో విధంగా బాధపడాల్సిన అవసరం కూడా ఉందని. పరితోపాటు మిగతా ఉత్పత్తులు కూడా పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు.వ్యవసాయ ఉత్పత్తుల లాభాలు రైతులకు అందిస్తున్నాయా లేదన్నది మొదటి ప్రశ్న అని, కష్టపడి పండించిన తర్వాత ఉత్పత్తులను ఎక్కడ అమ్ముకోవాలి? ఏ ధరకు అమ్ముకోవాలి అనేది ప్రశ్నార్థకం అయ్యిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గత ఐదు సంవత్సరాల క్రితం మూడు చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని. కానీ మూడు చట్టాలలో కొన్నింటిని కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరేలా ఉన్నాయన్నారు. చట్టాలు అధికారికంగా ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్ ఇచ్చే విధంగా ఉన్నాయని. ఇది బాధ్యతారహితము అన్నారు. రైతులంటేనే ప్రభుత్వాలను గద్దె నెక్కించగలవు, ప్రభుత్వాలను గద్దె దింపగలవని రాజకీయ పార్టీలు మరిచిపోకూడదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు మేలు జరిగే విధానాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులకు కీడు కలిగించే ఎలాంటి విధానాలైనా సరే రైతు నాయకులు, మేధావులు, ఆర్థికవేత్తలు శాస్త్రవేత్తలు అందరం కూడా వ్యతిరేకిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్వావర్ణ సందేశం సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం ఈ రైతు సంఘం మహాసభలో సందేశం ఇచ్చారు.

