24 C
Hyderabad
Sunday, August 2, 2026

హిందువులంతా ఐక్యం కాకుంటే పిప్రి మరో బెంగాల్ గా మారుతుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన ఎం.పీ

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

హిందువులంతా ఐక్యం కాకుంటే పిప్రి గ్రామం కూడా మరో బెంగాల్ గా మారుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లాలోని ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గత పది రోజుల క్రితం ముస్లిం వ్యక్తి, హిందూ వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టిన విషయం తెలుసుకున్న ఎంపీ మంగళవారం ఆ ఇంటిని సందర్శించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రాజమల్లు దగ్గర అప్పు తీసుకున్న ఒక ముస్లిం వ్యక్తి, తన అప్పు తిరిగి ఇవ్వమని అడిగిన రాజమల్లు ఇంటిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు పది వేల కుటుంబాలు ఉన్న పిప్రి గ్రామంలో 10 కుటుంబాలు ఉన్న ముస్లింల అధిపత్యం ఉందా అని ప్రశ్నించారు. అప్పు అడిగినందుకు ఒక హిందు వ్యక్తి ఇంటిని తగలబెడుతుంటే మిగిలిన హిందు కుటుంబాలన్ని చూస్తూ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా హిందువులందరూ ఏకం కావాలని ఆయన కోరారు. అలాగే బాధిత కుటుంబానికి రూ.25 లక్షల మేర ఆర్థిక నష్టం జరిగితే, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రూ.13 లక్షలు ఇప్పించటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు గ్రామంలో పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ వెంట పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, పలువురు బిజెపి నాయకులు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు.

More articles

Latest article