బతుకమ్మ, బిచ్కుంద : నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు చేప ట్టిన ఉల్లాస్ కార్యక్రమంలోని అమ్మకు అక్షరమా ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిచ్కుంద ఏపిఎం రవీందర్ పేర్కొన్నారు. సోమ వారం మండల కేంద్రంలోనీ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఓబీలు, వీవోఏలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆయ న మాట్లాడుతూ నిరక్షరాస్యు లను గుర్తించి వారికి చదువు నేర్పించడం కోసం వలంటీర్లను గుర్తించి ఉల్లాస్ యాప్‌లో న మోదు చేశామన్నారు. ప్రతి గ్రామసంఘం నుంచి ఇద్దరు ఓబీలకు, వీవోఏలకు శిక్షణ పొందిన సీఆర్‌పీలు శిక్షణ కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ శిక్షణను సద్విని యోగం చేసుకుని అక్షరకేం ద్రాల ద్వారా నిరక్షరాస్యులను అ క్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. అంకిత భావంతో అందరు కలిసి పని చేసి మండలంను ప్రథమ స్థానంలో నిలబెట్టాలన్నారు. నిర క్షరాస్యులు చదువు నేర్చు కోవడం ద్వారా సమా జంలో మంచి గుర్తింపు ఉంటుందని, వారి పను లు వారే స్వయంగా చేసు కుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా ధికారి శ్రీనివాస్ రెడ్డి, మహిళ స మాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి మహానంద, సీఆర్‌పీలు దుర్గ, సంగీత , ఐకెపి కార్యాలయ సిసిలు, అకౌంటెంట్, అన్ని గ్రామ సంఘాల వివోఏలు, గ్రామ సంఘ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

