29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా

Must read

📰 Generate e-Paper Clip

  • జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

 

మద్నూర్, బతుకమ్మ: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా  ఉంటాను అని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  భరోసాని ఇచ్చారు. మద్నూర్ గురు ఫంక్షన్ హాల్ లో మద్నూర్, డోంగ్లి రెండు మండలాల పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను సైతం ప్రజలకు గుర్తు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాలు అయినా ఎక్కడ అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు బన్షి పాటిల్, నాయకులు విజయ్, గోవింద్, సుల్తాన్ తదితరులు ఉన్నారు.

I will stand by BRS activists.

More articles

Latest article